ఎంపీ సహకారంతో ఊట్కూర్ అభివృద్ధికి కృషి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఎంపీడీకే అరుణ సహకారంతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి శక్తివంచన కృషి చేస్తానని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 7వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు లక్ష రూపాయలతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడతాననిఅన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ సిసి రోడ్డు పనులు, డ్రైనేజీలపై స్లాబులువేయడం వంటి పనులు చేపడుతున్నామనిఅన్నారు. వారాంతపు సంతలో ప్రజలకు వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో వివిధ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఊట్కూర్ పట్టణంలోని 16 వార్డులు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ఎంపీడీకే అరుణ నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేర్వేరుగా చెత్తా సేకరణ వాహనంలో వేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు చేరే విధంగాచూస్తామన్నారు. పట్టణంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యురాలు హీనా పర్వీన్ ముజాహిద్, నాయకులు బాలాంజనేయులు, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
