దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హై స్కూల్ పునర్నిర్మాణం చేపడతాం

దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హై స్కూల్ పునర్నిర్మాణం చేపడతాం

కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్

భవానిపురం, ఆంధ్రప్రభ : గత వై సీ పీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి నోచుకోక నిర్మాణ దశలో ఆగిపోయిన దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ను అభివృద్ధి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ అన్నారు.కుమ్మరిపాలెం లోని డీ ఎస్ ఎం సి హెచ్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు పాఠశాల పునర్నిర్మాణం చేపట్టాలని ఆదివారం విద్యాధరపురం లోని స్కూల్ వద్ద ఎం ఎస్ బేగ్ కు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు.తామంతా ఇక్కడే చదువుకున్నామని ఎంతమంది అధికారులను కలిసిన న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలను అభివృద్ధి చేయాలని దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో అప్పటి ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పునాదులకే పరిమితం చేసిందని పూర్వ విద్యార్థులు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు.ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందన్నారు.ఎం పి కేశినేని శివనాద్ (చిన్ని) ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతామన్నారు.సామాజిక బాధ్యతగా పునర్నిర్మాణం చేపడతామని ఎం ఎస్ బేగ్ తెలపడంతో డీ ఎస్ ఎం సి హెచ్ పాఠశాల పూర్వ విద్యార్థులు , కూటమినేతలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Leave a Reply