Hayathnagar Neeladri Hospital | బంధువుల ఆందోళన
హయత్‌నగర్ నీలాద్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
Hayathnagar Neeladri Hospital | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంజుల అనే మహిళ ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్స కోసం నీలాద్రి ఆస్పత్రికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శస్త్రచికిత్సకు ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం విషమించిందని, చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వైద్య కారణాలు, ఇతర అంశాలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
