డిఆర్ డి ఏపిడిని సన్మానించిన వివో ఏలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా డి ఆర్ డి ఏ పీడీగా ఎన్ వెంకట్రాములు ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించడంతో ఊట్కూర్ మండల వివో ఏలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వివో ఏ ల సంఘం అధ్యక్షులు అనిల్, కార్యదర్శి స్వాతి మాట్లాడుతూ.. వివోఎల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 18 నుండి సమ్మె చేపడుతున్నామని అన్నారు. వివో ఏ లకు నెలకురూ.20 వేలు వేతనం చెల్లించాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ఏ కల్పించాలని అర్హత కలిగిన తమను సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 58 సవరణ చేసి ట్యాబుసౌకర్యంకల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివో ఏ లు వెంకటేశ్వరమ్మ, సుజాత, కల్పన, రామేశ్వరి, సంతోష, అనిత, జ్యోతి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply