రేపు ప్రభుత్వ విప్ వేముల చిట్యాలకు రాక
రేపు ప్రభుత్వ విప్ వేముల చిట్యాలకు రాక
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రజా పాలన పట్టణ ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చిట్యాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుర చైర్పర్సన్ పందిరి గీత రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నకరేకల్లు శాసనసభ్యులు వేముల వీరేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు చిట్యాల బస్ స్టాండ్ లో మొక్కలు నాటడం జరుగుతుందని చైర్మన్ పందిరి గీత తెలిపారు. హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు నాయకులు హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ పందిరి గీత రమేష్ పిలుపునిచ్చారు.
