ఈసారి మహానాడులో మారుతున్నది ఏమిటి..?

ఈసారి మహానాడులో మారుతున్నది ఏమిటి..?

పెడన, ఆంధ్రప్రభ : మహానాడు ఏర్పాట్లపై పెడన తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల, టౌన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ పరిశీలకులు, స్టేట్ సెక్రటరీ షేక్ ఆషాతో కలిసి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మహానాడుకు భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

Leave a Reply