విజయవాడ ప్రజల దౌర్భాగ్యం..

విజయవాడ ప్రజల దౌర్భాగ్యం..

నెమలి వేణు గోపాల్ స్వామి ఉత్సవాల్లో కేశినేని శివనాథ్ రాధాత్తం
గతంలో వేణు గోపాల్ స్వామి ఉత్సవాలు గొప్పగా జరిగేవి
పార్లమెంటు పరిధిలో ఇసుక, మట్టి, భూకబ్జాలు, పంచాయితీలు, ఎంపీ కనుసన్నల్లో
హిందూ ధర్మ గురించి చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజల కు సమాధానం చెప్పాలీ
టిటిడి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన కూటమి ప్రభుత్వం
మంత్రి నారా లోకేశ్ ఆశీస్సుల తో ఎంపీ చిన్ని అరాచకాలు
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్

విజయవాడ తూర్పు ప్రతినిధి,ఆంధ్రప్రభ: విజయవాడ పార్లమెంటు పరిధిలోనీ తిరువూరు నియోజకవర్గంలో నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తువస్తున్నారు. నెమలి ఉత్సవాలలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యవహరించిన తీరు చాలా బాధాకరం,అటువంటి కార్యక్రమాన్ని ఎంపీ కేసినేని చిన్ని భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవరించారని ఇలాంటి పార్లమెంట్ సభ్యులు ఉండటం ఎన్టీఆర్ జిల్లా ప్రజల కర్మ, దౌర్భాగ్యం అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు.


ఢిల్లీ స్థాయిలో గతంలో ఎంతో గొప్ప వ్యక్తులు మన విజయవాడకు ఎంపీలుగా చేశారు. విజయవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. కానీ కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని అవినీతి అక్రమాలు,ఇసుక,మట్టి,దేవుడు భూములు కబ్జా,పంచాయతీలు, చేస్తున్నారని ఒక విధి,రౌడీ, గుండగిరి లాంటి పనులు ఎంపీ చేస్తున్నాడనీ ఆయన ఆరోపణలు చేశారు. ఎంపీకి ఉండాల్సిన హుందాతనం చిన్నికి లేదు, వేణుగోపాల స్వామి పట్టు వస్త్రాలు సమర్పణలో పెద్ద రాదతం చేసి ఉత్సవాలను నాశనం చేస్తున్నారని అన్నారు.

తిరువూరు చెందిన ఎస్.సి ఎమ్మెల్యే విధులకు అడ్డు తగులుతూ,ఆయన హక్కులను హరిస్తూ ,దేవుడి కార్యక్రమం లో జ్యోక్యం చేసుకొని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వేణు గోపాల స్వామి కళ్యాణం గొప్పతనన్నీ బ్రస్టు పట్టించారనీ, జిల్లా పరువు పోయేలా ఆయన వ్యవహరించాడనీ అవినాష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం లో అతనిపై రుబాబు చేస్తున్నాడు. అతనికి అధికారులు సహకరించకుండా ఎంపీ వ్యవహరిస్తునట్లు వివరించారు.

హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు సమాధానం చెప్పాలి, దసరా మహోత్సవాల సమయంలో విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకొని అమ్మవారి ఉత్సవాలు పేరు తో వ్యాపారం చేసి కోట్ల రూపాయలు చిన్ని దోచుకున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనలో ఇలాంటి ఘటన జరగలేదు అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.ఈ రెండు సవంత్సరల కాలం లో దేవుడి కార్యక్రమం లలో భక్తుల తొక్కిసలాట, ప్రాణాలు కోల్పోవటం, తప్ప మంచి జరిగినది ఏమిలేదు.


ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు నిలదీస్తే వారిపై అసత్య ప్రచారాలు చేయటం కూటమి నేతలు కి అలవాటు గా మారింది.టీటీడీ లడ్డు విషయంలో ప్రభుత్వం పరువు మొత్తం పోయింది.దేవుడు ఆశీస్సులు తమ పై ఉన్నాయి వాస్తవం ఏమిటో అందరికీ తెలిసింది, రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతారని తిరువూరులో ఎంపీ వలన ఏ పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నారా లోకేష్ వెనక ఉన్నడాన్న ధైర్యంతో చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో అరాచకాలు చేస్తూ, వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైనా తిరువూరు ప్రజలందరికీ ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply