పరిహార చెక్కు వెనుక ఉన్న కథ ఏమిటి?
పరిహార చెక్కు వెనుక ఉన్న కథ ఏమిటి?
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: అవనిగడ్డ సబ్ జైలులో 2023 మే 6న రిమాండ్ ఖైదీగా ఉండగా మృతి చెందిన ఖైదీ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందజేసింది.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు పరిహార చెక్కును అందజేశారు. మృతి చెందిన ఖైదీ పులి కోటేశ్వరరావు అలియాస్ కోటి (వీర్రాజు కుమారుడు) కుమారుడు పులి చైతన్యకు ఈ చెక్కు అందించారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ పరిహారం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. NHRC మార్గదర్శకాల ప్రకారం బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మేజిస్ట్రేట్ విభాగ సిబ్బంది ప్రదీప్ పాల్గొన్నారు.
