పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

కడెం, ఆంధ్రప్రభ ; పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని చిట్యాల్ జిపి సర్పంచ్ చీమల భీమేష్ అన్నారు. కడెం మండలంలోని చిట్యాల్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువుల ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని సర్పంచ్ చీమల భీమేష్ ప్రారంభించారు.
మండలంలోని పశువులకు దూడలకు ఆవులకు గేదెలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని ఈ టీకాల శిబిరాన్ని మండలంలోని రైతులు పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ పి సౌందర్య కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ భగవంతు రావు, జీపీ వార్డు సభ్యుడు జేవి ఓజే రాజేశ్వర్, పశు వైద్య సిబ్బంది విజయ హరీష్, రాజేశ్వర్ బి రమేష్ మల్లేష్ రైతులు పాల్గొన్నారు.
