పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాల సొంతింటి కలను సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డిఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో దావూద్ ఇందిరమ్మ గృహప్రవేశం సర్పంచ్ ఎం. రేణుక భరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తూ అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని సీఎం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష గృహప్రవేశాలు ఈరోజు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై మంజూరు చేయడం ద్వారా కుటుంబ ఆస్తులపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని అన్నారు. రెండో విడతలో అర్హులైన పేద వారందరికీ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యుడు కొక్కు మల్లేష్, గృహ నిర్మాణ శాఖ ఏ ఈ ప్రేమ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొక్కులింగం, నాయకులు గోవిందప్ప, రాఘవేందర్ గౌడ్, రవికుమార్, అర్ఫత్, తదితరులు పాల్గొన్నారు.