TB disease | టీబీ వ్యాధిపై అవగాహన శిబిరం..

TB disease | టీబీ వ్యాధిపై అవగాహన శిబిరం..

TB disease | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెంలో బుధవారం మంచిర్యాల జిల్లా క్షయ వ్యాధి (టిబి )అధికారి ఎల్ సుధాకర్ ఆదేశాల మేరకు దండేపల్లి వైద్య అధికారి డా. సతీష్ కుమార్ ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెండు వారాలకు మించి దగ్గు ఉండటం, గళ్ల పడటం లాంటి లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.

ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తామన్నారు. ఛాతిలో నొప్పి, జ్వరం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా టీబీ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే సంబంధిత రోగులకు ఉచితంగా టీబీ మందులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం 85 మందికి ఎక్స్రేలు చేయించారు. 15 మంది కి పరీక్షలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో,హెచ్ సి ఎల్ పి సురేష్, ఎం ఎల్ హెచ్ పి.శ్రీవాని, మనీషా,రాధిక,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.