ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య సాధ్యం
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య సాధ్యం
తన కుమారుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్ సునీల్
తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య సాధ్యమని మాటేడ్ సర్పంచ్ నాగరబోయిన సునీల్ యాదవ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ ప్రధమ పౌరుడు, సర్పంచ్ సునీల్ యాదవ్ ఆయన కుమారుడు మాస్టర్ హర్షవర్ధన్ యాదవ్ ను బుధవారం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.
