ఏజెన్సీలో ప్రసూతి సెంటర్లుగా 108 అంబులెన్స్ లు
ఏజెన్సీలో ప్రసూతి సెంటర్లుగా 108 అంబులెన్స్ లు
ఎక్కువ శాతం 108 ఆంబులెన్స్ లోనే ప్రసూతి
వైద్యాధికారులుగా ఈఎంటి లు
108, 102 వాహనాల సేవలపై ప్రజల ప్రశంసలు
జైనూర్, ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఉట్నూర్, జైనూర్, సిర్పూర్ (యు ) ఇంద్రవెల్లి నార్నూర్ సిర్పూర్ యు లింగాపూర్ కెరమెరి ఏజెన్సీ మండలాల్లో ఎక్కువ శాతం ఆదివాసి గిరిజన గర్భిణీ మహిళలు 108 అంబులెన్స్ లోని ప్రసూతి అవుతున్నారు. అత్యవసర సేవల కోసం 108, 102 వాహనాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. గర్భిణీ మహిళలకు ప్రసూతి కోసం 108 అంబులెన్సులు ప్రసూతి సెంటర్లుగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. 108 లో వైద్యాధికారులుగా ఈఎంటిలు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ మహిళలకు 108 వాహనాలుని ప్రసూతి సేవలు చేస్తున్నారు. నిరుపేద గర్భిణీ మహిళలకు పురిటి నొప్పులు రాగానే 108 కు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చాలామంది గర్భిణీ మహిళలకు 108 లోనే తరలించే మార్గ మధ్యలోనే అధిక పురిటి నొప్పులు రావడంతో 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈ ఎంపీలు పైలెట్లు వాహనాలను మధ్యలోనే ఆపుతూ సుఖ ప్రసూతి చేస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.
ఇప్పటివరకు చాలా గర్భిణీ మహిళలు 108 అంబులెన్స్ లోనే ప్రసూతి అయినప్పటికీ ఎలాంటి ప్రాణాన్ని నష్టము జరగకపోవడంతో 108 ఈఎంటి, సంతోష వ్యక్తం చేస్తున్నారు. 108 ఉద్యోగుల సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. రోగులకు గర్భిణీ మహిళలకు ఆపదలో ఆత్మబంధువుగా 108 ఉద్యోగులు చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. అంబులెన్సులు సక్రంగా పనిచేసేలా 108 జిల్లా అధికారులు మధ్య మధ్యలో పర్యవేక్షణ చేస్తూ వాహనాల పనితీరును పరిశీలిస్తున్నారు. గతంలో గర్భిణీ మహిళలు ప్రసూతి కోసం ప్రైవేటు వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలకు తీసుకు వెళ్లేవారు ఈ వాహనాలు వచ్చిన తర్వాత ప్రజలకు ఖర్చు తగ్గడంతో పాటు సేవలు అందుబాటులో అందడం జరుగుతుందని ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంత మండలాల్లో గర్భిణీ మహిళలు 108 వాహనాల్లో ప్రసూతి కావడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం మహిళలు ప్రతి నెల నెల వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వారికి తగిన పోస్ట్ కారమందకపోవడం వల్లనే తక్కువ నెలలోనే కొంతమంది గర్భిణీ మహిళలు ప్రసూతి కావడం జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
నేటి కాలంలో తినే ఆహారం వల్ల ఎక్కువ శాతం గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆనాటి కాలంలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన మహిళలు ఇండ్లలోనే సాధారణ ప్రసూతి జరిగేదని గిరిజనులు పేర్కొంటున్నారు. వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో ఆనాటి కాలంలో గర్భిణీ మహిళలకు మంత్రశాన్ని మహిళ ప్రసూతి చేసేది ఇప్పుడు ఆ మంత్రశాని మహిళలు కానరావడం లేదని చాలామంది గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రధానంగా రోడ్లు సరిగా లేక గర్భిణీ మహిళలకు సరైన పౌష్టికాహారం లేకనే పురిటి నొక్కులు వచ్చినప్పుడు 108లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని ప్రసూతి అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు 108 102 అమ్మఒడి వాహనాలు ఏర్పడుతూ ఏజెన్సీ ప్రాంతాన్ని నిరుపేద ప్రజలకు అత్యవసర వైద్య సేవలతో పాటు గర్భిణీ మహిళలకు ప్రసూతి కోసం తీసుకువెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అవగాహనాలో సేవలందిస్తున్న ఉద్యోగులకు ఆ సమస్యకు ప్రజలు ప్రశంసిస్తున్నారు.
