లింగాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా బొంగు వెంకన్న ఎన్నిక.. నూతన కమిటీకి ఘన సత్కారం
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
కమిటీ అధ్యక్షుడిగా బొంగు వెంకన్న, ఉపాధ్యక్షుడిగా ఆరెల్లి రాజన్న, కోశాధికారిగా నీరటి రాజేందర్, కార్యదర్శిగా కల్వకుంట్ల నరేష్ ఎన్నికయ్యారు. సలహాదారుగా మాదాసు రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా ధరం సౌత్ రాజేష్ నాయక్‌ను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులను స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేసి ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్, ఉపసర్పంచ్ కమ్ముల లక్ష్మి స్వామి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
