తాగునీటి సమస్యను తీర్చిన సర్పంచ్..

తాగునీటి సమస్యను తీర్చిన సర్పంచ్..
ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సిందే లింగారం పటేల్
కుంటాల, ఆంధ్రప్రభ: సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ కాలనీలోని తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రతి వీధికి తాగునీటి సరఫరా అయ్యేలా నల్లా కనెక్షన్ అందిస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే ఆ హామీని నెరవేరుస్తానని చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం శనివారం కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామ సర్పంచ్ సిందే లింగారం పటేల్ ఎస్సీ కాలనీలోని తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు.

గత కొన్ని రోజులుగా ఎస్సీ కాలనీలో తాగునీటికి ఒకే ఒక నల్లా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ సమస్యకు పరిష్కారం చూపారు.
దీంతో కాలనీవాసులు స్థానిక సర్పంచ్ సిందే లింగారం పటేల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గల్లాపురం రమేష్, ఉప సర్పంచ్ సిహెచ్ అశోక్, కారోబారి లక్ష్మణ్, వార్డు సభ్యులు ఉమ్రి సురేష్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
