బాసర త్రిబుల్ ఐటీకి లింగాపూర్ విద్యార్థులు ఎంపిక..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లింగాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో ప్రవేశానికి ఎంపికయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం, వి. వెంకట కృష్ణ, టి. దీక్షిత్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో అర్హత సాధించి బాసర క్యాంపస్‌కు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్, కమ్ముల లక్ష్మి స్వామి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
