ఘనంగా జాదూ రంగనాధ్ ను సత్కరాం..
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; నగరంలోని జిల్లా బాలభవన్ లో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన నిజామాబాదు జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కార్యక్రమ వివరాలు తెలుసు కొని, పనితీరును ప్రశంశించారు. ఇంద్రజాల రంగంలో సుదీర్ఘ అనుభవమున్న మెజీషియన్ జాదూ యుగంధర్ రంగనాధ్ గత15 సంవత్సరాలుగా పిల్లలకు ఎన్నో రకాల మ్యాజిక్ అంశాలలో శిక్షణ ఇచ్చి ఎంతోమంది ని కళాకారులగా తీర్చిదిద్ధిన విధము తెలుసుకొని జాదూ రంగనాధ్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో బాలభవన్ సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల, శిక్షణాతరగతుల ఇంచార్జ్ విఠల్ ప్రభాకర్ సిబ్బంది, పిల్లలు ఉన్నారు.
