Ramachander Rao | కవిత కొత్త పార్టీపై బీజేపీ సెటైర్లు..
Ramachander Rao | కవిత కొత్త పార్టీపై బీజేపీ సెటైర్లు..
Ramachander Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ప్రకటించగా, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. టీఆర్‌ఎస్ పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
కవిత కొత్త పార్టీపై స్పందించిన రామచందర్ రావు, “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు” అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తుందో ప్రజలే నిర్ణయించాలని పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందించారని ప్రశంసించారు.
“గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్.. పుట్టబోయే బిడ్డ పేరు మళ్లీ టీఆర్ఎస్ అంటా” అంటూ సెటైర్లు వేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో చివరకు బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కవిత బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి 7 మండలాలు వేరుపడితే బీజేపీ ఎంపీలు స్పందించలేదని మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చకపోయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు.
భద్రాచలం పరిసర 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఈ అంశంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కోరారు. మూడు ప్రధాన పార్టీలపై అలుపెరగని పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కవిత పిలుపునిచ్చారు.
