పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

2వ వార్డు కౌన్సిలర్ పర్స కుశలత అనంతరావు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : దేశాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని 2వ వార్డు కౌన్సిలర్ పర్స కుశలత అనంతరావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ పట్టణంలోని 2వ వార్డులో గల శ్రీ బాలాజీ హాస్పిటల్‌లో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ రెండు చుక్కలు వేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పర్స కుశలత అనంతరావు ఆశా వర్కర్లతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. 0–5 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.