April 24th | తులంగా బంగారం ఎంతంటే..?
April 24th | తులంగా బంగారం ఎంతంటే..?
April 24th | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం కొనుగోలు చేసేవారికి ఈ రోజు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇవాళ గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో కొనుగోలుదారులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారం రోజుల్లో బంగారం ధరలు ఒక్కసారి మాత్రమే పెరిగింది. ఏప్రిల్ 24న మాత్రమే స్వల్పంగా పెరిగింది.నిన్న స్వల్పంగా ధర పెరిగినప్పటికీ ఇవాళ స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. ఒక్కరోజు రూ. 5 వేలు పెరిగింది.
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధంపై నెలకొన్న అనిశ్చితి కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కిందటి రోజు భారీగా పెరిగి మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 105 డాలర్ల మార్కు వద్ద ఉంది. దీంతో బంగారం రేట్లు కూడా యథాతథంగానే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేటు చూస్తే ప్రస్తుతం స్థిరంగానే ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,41,200 వద్ద ఉంది. కిందటి రోజు రూ. 450 పెరగ్గా.. దానికి ముందు వరుసగా రూ. 1100, రూ. 500, రూ. 450 చొప్పున తగ్గాయి. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,040 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 490 మేర పెరిగింది.
వెండి ధర మాత్రం మళ్లీ ఎగబాకింది. ఈ రోజు రూ. 5 వేలు పెరిగింది. హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వారంలో రూ. 15 వేలు తగ్గింది.
