హైదరాబాద్ – ప్రతి నీటి బొట్టు అత్యంత విలువైంది. భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపుగా వాడాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ నేత, గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు జె.సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్టు పెట్టారు. ప్రపంచ జల దినోత్సవం నాడు, మన అత్యంత విలువైన వనరులను పరిరక్షించుకుంటామని వాటిని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. మనం భవిష్యత్తు తరాలకు నీటి భద్రతగా ఉంచుకోవాలన్నారు. నీటి పొదపు చాలా అవసరమన్నారు.
