30 liters | బ్లాక్‌లో జోరుగా అమ్మకాలు

30 liters | బ్లాక్‌లో జోరుగా అమ్మకాలు
30 liters | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత వేధిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి, అల్లూరి, విజయనగరం, విశాఖపట్నం మరియు కర్నూలు జిల్లాల్లోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం ఉన్న బంకుల్లో వాహనాలు క్యూ కట్టాయి. సరఫరా అంతరాయంతో బ్లాక్ మార్కెట్లో లీటరు డీజిల్ రూ.300 వరకు అమ్ముతున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరి కోతలు, ఆక్వా సాగు పనులకు డీజిల్ దొరక్క రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకపోవడంతో, బయట లీటరుకు రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని బంకుల్లో 30 లీటర్ల డీజిల్‌కు ఒక లీటర్ ఇంజన్ ఆయిల్ తప్పనిసరిగా కొనాలనే నిబంధనలు విధిస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. నిల్వలు ఉన్నప్పటికీ, భయంతో ప్రజలు ఎక్కువగా కొనడంతో బంకులు త్వరగా ఖాళీ అవుతున్నాయని, అధికారులు చెబుతున్నారు.
