కోనాపురంలో.. ఇంటి ఇంటి ప్రచారం..

కోనాపురంలో.. ఇంటి ఇంటి ప్రచారం..

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా శ్రీలత – రామును భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు పరిధిలోని కోనాపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై  బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ… కోనాపురం గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్య, తాగునీటి బోరు మోటార్ సమస్య, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలు సహా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఈ సమస్యలను దశల వారీగా, సమగ్రంగా పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు కోరిన విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే స్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించి, అక్కడ కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా కోనాపురం గ్రామానికి సమీప ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైలు, మున్సిఫ్ కోర్టు, మినీ స్టేడియం, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కీలక అభివృద్ధి పనులకు సంబంధించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, క్రీడలు, న్యాయ సదుపాయాలు మరింత దగ్గర అవుతాయని అన్నారు. ఈ అభివృద్ధి పనులలో ఏర్పడే చిన్నచిన్న ఉద్యోగాలు, పని అవకాశాలను స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. స్థానికుల ఉపాధి, సంక్షేమాన్ని కాపాడుకోవడం తన బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలోఎలికట్టె  ముత్తయ్యా, ఎలికట్టే ప్రభాకర్, బాబు, వెంకట స్వామి, ఎల్లయ్య తో పాటు అధ్యక్షుడు నిఖిల్, ప్రదీప్, అశోక్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్బిడి రాజీరెడ్డి, పోశాల వెంకన్న ఇంచార్జీలు పోలేపల్లి శంకర్ రెడ్డి, దేవరకొండ అనిల్, చిలువేరు శ్రీనివాస్, బోలెపల్లె మధుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.