Chityala | విద్యార్థులకు ఉచితంగా గైడ్ల పంపిణీ..

Chityala | విద్యార్థులకు ఉచితంగా గైడ్ల పంపిణీ..

Chityala, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు హనుమకొండలోని లావణ్య హాస్పిటల్ డాక్టర్ ఏకు నవీన్ సహకారంతో అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ గైడ్ల పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రామ బాయ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఈ పంపిణీ చేసినట్లు ఏబిఎస్ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్, మిట్టపల్లి మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్, పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రీరామ్ రఘుపతి, ఉపాధ్యాయులు బుర్ర సదయ్య, విద్యార్థి యువ నాయకులు వాసాల రాకేష్, వంశీకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply