Knife attack in Japan  :  కత్తితో  స్వైర విహరం Andhra Prabha Latest News

Knife attack in Japan  :  కత్తితో  స్వైర విహరం Andhra Prabha Latest News

టైర్​ ఫ్యాక్టరీలో  రసాయన దాడి

15 మందికి తీవ్రగాయాలు

ఘాతకుడు అరెస్టు

( టోక్యో,  ఆంధ్రప్రభ)  

Knife attack in Japan   |   అమెరికాకు భిన్నంగా.. తుపాకీ కల్చర్​ ను జపాన్​ అసలు సహించదు. ఇప్పటికే ఈ దేశంలో తుపాకీ కట్టడికి కఠిన చట్టాలు ఉన్నాయి . అందుకే   హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతాయి, కానీ  ఇటీవల కాలంలో అనేక  హై ప్రొఫైల్ కత్తి దాడులు  పెరుగుతున్నాయి.

Knife attack in Japan

nife attack in Japan   |

తాజాగా ఓ వ్యక్తి ఓ టైర్​ ఫ్యాక్టరీలో ఊచకోతకు ప్రయత్నించాడు. కనిపించినోళ్లను కనిపించినట్టు (Knife attack) కత్తితో పొడిచాడు. సామూహిక నరమేధానికి దిగాడు. 8  మందిని  ( 8 Stabbed)  పొడిచాడు. రసాయన దాడికి (camicai attack)  పాల్పడ్డాడు. ఈ దాడిలో మరో 7గురు తీవ్రంగా (7 Injured)  గాయపడ్డారు.  ఈ  దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ అదృష్టవశాత్తు క్షతగాత్రులందరూ ప్రాణాలతో  బయట పడ్డారు.

ife attack in Japan   |

ఘాతుకుడిని జపాన్​ పోలీసులు అరెస్టు చేశారు.  వివరాలు ఇలా ఉన్నాయి. సెంట్రల్​ జపాన్​  టోక్యోకు పశ్చిమాన  షిజువోకా  ప్రిఫెక్చర్‌లోని  మిషిమా నగరంలోని  యోకోహామా టైర్​ తయారీ (Tyre Factory)  ఫ్యాక్టరీలోకి  శుక్రవారం జపాను కాలమానం ప్రకారం  సాయంత్రం   4.00 గంటలకు  గ్యాస్​ మాప్క్​ తో   వ్యక్తి ప్రవేశించాడు.  సర్వైవల్ నైఫ్‌తో  (Survival Kmife)  8 మందిని పొడిచాడు. తన వెంట తెచ్చుకున్న రసాయనాన్ని వెదజల్లాడు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రాంతం హాహాకారాలతో దద్దరిల్లిపోయింది.  

Knife attack in Japan

ife attack in Japan   |

సాయంత్రం 4:25 నుండి 4:30 గంటల మధ్య పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలికి చేరుకుని  ఓ వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు.  ఆగంతకుడు  మాజీ ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడు (Masaki oyama)    మసాకి ఒయామా (38) ను అరెస్టు చేశారు.  అతడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడో.. వివరాలు వెలుగులోకి రాలేదు. కత్తి పోట్లతో గాయపడిన  ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించామని,  వీరిలో 5 గురు పరిస్థితి విషమంగా ఉందని  ఫుజిసాన్ నాంటో అగ్నిమాపక విభాగం తెలిపింది.

ALSO rEAD : Bangla Tense :  తారిక్ ​ రీ ఎంట్రీ ..! Andhra Prabha Real News

Leave a Reply