Accidentally | ఈఈ సతీశ్ చంద్ర అనుమానాస్పద మృతి
Accidentally | ఈఈ సతీశ్ చంద్ర అనుమానాస్పద మృతి
Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లాలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ ) సతీశ్ చంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో పడి ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సతీశ్ చంద్ర మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడ్డారా లేక పని ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎప్పుడూ విధుల్లో చురుగ్గా ఉంటూ జిల్లా సాగునీటి సరఫరాను పర్యవేక్షించే అధికారి ఇలా మృతిచెందడం తోటి ఉద్యోగులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
