RDO | కడెం తహసీల్దార్ ప్రమోషన్

RDO | కడెం తహసీల్దార్ ప్రమోషన్

  • ప్రభాకర్‌కు ఆర్డీవోగా ప‌దోన్న‌తి

RDO | కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీనియారిటీ ప్రకారం పలువురు తహసీల్దార్లకు ఆర్డీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కడెం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రొడ్డ ప్రభాకర్ ఆర్డీఓగా పదోన్నతి పొందారు. ఆర్డీఓ ప్రమోషన్ పొందిన తహసీల్దార్ రిలీవ్ అయి హైదరాబాద్ సీసీఎల్‌లో రిపోర్ట్ చేసిన అనంతరం ఆర్డీఓగా పదోన్నతి పొందుతారు. ప్రస్తుతం కడెం మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న ప్రభాకర్ రిలీవ్ అయిన తర్వాత ఆయన స్థానంలో మరొకరు ఇక్క‌డ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply