కదిరి మున్సిపల్ కమిషనర్ మార్పు

కదిరి మున్సిపల్ కమిషనర్ మార్పు
- కిరణ్ కుమార్ రిపాట్రియేషన్, సందీప్‌కు అదనపు బాధ్యతలు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో కమిషనర్ పదవిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కమిషనర్‌గా కొనసాగుతున్న కె. కిరణ్ కుమార్‌ను ఆయన మాతృశాఖ అయిన హార్టికల్చర్ విభాగానికి ప్రభుత్వం తక్షణమే రిపాట్రియేట్ చేసింది.
ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ డా. పి. సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా కదిరి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వి. సందీప్‌కు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా కిరణ్ కుమార్ తన బాధ్యతలను వెంటనే సందీప్‌కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొత్త కమిషనర్ నియామకం జరిగే వరకు సందీప్ ఈ అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు.
