AP | కేజీబీవీ విద్యార్థి ఆత్మహత్య..
వసతిగృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థిని మృతి
AP |కొత్తూరు, జులై 31(ఆంధ్రప్రభ ) : శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న కేజీబీవీ టైప్-4 వసతి గృహంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బై పీసీ చదువుతున్న సవర పూజా అనే విద్యార్థిణి ఆత్మహత్యకు పాల్పడింది.
గురువారం అర్ధరాత్రి స్థానిక వసతి గృహం పైఅంతస్తులో ఖాళీగా ఉన్న ఒక గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని పూజా ఉన్నట్లు వసతి గృహం సిబ్బంది శుక్రవారం ఉదయం చూశారు. ఈ సంఘటన పై కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ ఎం, వసతి గృహం పర్యవేక్షణ అధికారి ఎ గోవిందరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…. సవర పూజా, ఇంటర్ బై పీసీ మొదటి సంవత్సరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లోనే చదువుతుంది. పూజా ను తల్లిదండ్రులు ఇక్కడ చేర్చకముందు రాజాంలో కళాశాలలో జాయిన్ అయ్యిందని, ఐతే అక్కడ నుండి పూజా తల్లిదండ్రులు కొత్తూరు లో చేర్పించగా, గత 20 రోజులు క్రితం స్థానిక కేజీబీవీ లో చేరింది. ఈమె స్వగ్రామం, సీతంపేట మండలం దేవానపురం పంచాయితీ, లక్కాయి గూడ గిరిజన గ్రామం.
ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయోనని మొదట భావించిన స్థానిక కేజీబీవీ అధికారులు, పూజా ఉరివేసుకున్న గదిలోనే ఒక పుస్తకంలో విషయం రాసిందని గమనించిన పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి ఆ పుస్తకంలో పూజా రాసిన విషయాన్ని లెటర్ గా పరిశీలించారని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ లెటర్ ఆధారంగా పూజా ఆత్మహత్య కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సంఘటనపై కొత్తూరు పోలీసులు పరిశీలించారు. ఇదిలా ఉండగా కేజీబీవీ భవనం గదిలో విద్యార్థిణి పూజా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడంతో వసతి గృహంలో విద్యార్థులు బిక్కు బిక్కుమంటున్నారు. కేజీబీవీ అధికారులు పూజా స్వగ్రామంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సీతంపేట మండలం దేవానపురం పంచాయితీ, లక్కాయి గూడకు చెందిన గిరిజనులు, బంధువులు బోరున విలపిస్తూ కొత్తూరు కేజీబీసీ వసతి గృహానికి చేరుకున్నారు. ఈ సంఘటన పై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

