Bhavani | దీక్షల విరమణ విజయవంతం
Bhavani | దీక్షల విరమణ విజయవంతం
సమన్వయంతో భవానీ లందరికీ విస్తృత ఏర్పాట్లు
కట్టుదిట్టమైన బందోబస్తు
ప్రశాంతంగా శీఘ్రంగా అమ్మవారి దర్శనం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు
Bhavani | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : డిసెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే భవాని దీక్షల (Bhavani’s initiations) విరమణ కార్యక్రమం 15వ తేదీ వరకు జరిగే భవాని దీక్షల విరమణ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి దీక్షా విరమణ కోసం విజయవాడకు వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మి శ, మున్సిపల్ కమిషనర్, డి.సి.పి.లు, దేవస్థాన అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి హోమగుండాలు, విరుముడుల స్టాండ్ల ఏర్పాటు ప్రదేశాలను గురువారం విస్తృతంగా తిరిగి పరిశీలించారు. అలాగే భక్తుల ప్రవేశం-నిష్క్రమణ మార్గాలు, ప్రసాదం కౌంటర్లు, గిరిప్రదక్షిణ ప్రదేశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. గిరిప్రదక్షణ సందర్భంగా రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేలా సూచనలు చేయడంతో పాటు, దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. క్యూలైన్లను, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను కూడా పరిశీలించి భద్రత, సౌకర్యాల పరంగా పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ (Police) కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఈ సారి భవాని దీక్షా విరమణను, దసరా మహోత్సవాల్లానే అత్యుత్తమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అన్నీ రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సారి హోర్డింగ్ ఏరియాల డిజైన్ కూడా కొంత మార్పు చేసి ఎటునుంచి వచ్చిన భక్తులైనా ఒకే సమయానికి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, రెండు షిఫ్టుల్లో సుమారు 3000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భవాని భక్తుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించబడిందని, దర్శనానికి వచ్చే భక్తులు ఈ యాప్ ద్వారా సమాచారం పొందాలని, అదేవిధంగా లడ్డూలను ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశమున్నట్టు తెలిపారు.

జిల్లా కలెక్టర్ లక్ష్మీశ (District Collector Lakshmi) మాట్లాడుతూ… భవాని దీక్షా విరమణ-2025 విజయవంతం కావడానికి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు జల్లు కేంద్రాలు, శానిటేషన్, తాగునీరు, అన్ని వసతులను మరింత విస్తరించి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
