కెన్యాలో (Kenya )జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖతర్‌లో (Quattar) నివాసముంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు (NRI ) దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది.
ప్రమాద సమయంలో వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన నిమిత్తం కెన్యాలో ఉన్నారు ..మొత్తం 28 మంది ప్రవాస భారతీయులు ఒక బస్సులో (Bus ) ప్రయాణిస్తుండగా.. వారి వాహనం ప్రమాదవశాత్తూ లోయలోకి పడిపోయింది
.
ఈ ఘటన నైరోబికి (Nairobi) సమీపంలోని పర్యాటక ప్రదేశం వద్ద జరిగింది. ప్రమాదానికి గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిందా? లేక మరే ఇతర వాహనం ఢీ కొట్టిందా ? అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇక ప్రమాదంలో ఐదుగురు (five persons) అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయినట్టు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వారు నైరోబిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ దుర్ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ఘటన స్థలానికి నైరోబిలోని భారత రాయబార కార్యాలయ అధికారులు చేరుకున్నారని స్పష్టం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని.. స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించారు. గాయపడినవారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని వెల్లడించింది.