HYD| శృంగేరి శ్రీచరణుల అనుగ్రహ బలంతో శ్రీమాలికను శంకరమఠాలకు అందించబోతున్నాం !

పురాణపండను ప్రశంసించిన జ్ఞానసరస్వతీ ఆలయ ధర్మాధికారి జనార్ధనమూర్తి


హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్ర‌ప్ర‌భ ) : అనుష్ఠానాన్ని కొనసాగించే వారింట కల్పతరువులా, వేద మర్యాదలను తలపైకెత్తుకునే వారి పాలిట కామధేనువులా శ్రీ మాలిక వంటి అత్యద్భుత మంత్ర స్తోత్ర పేటికను బంగారు సంపెంగల్లాంటి రమణీయ పరిమళాల వ్యాఖ్యానాలతో పదహారవ పునర్ముద్రణగా అందించిన ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ (PURANAPANDA SRINIVAS) పై పీఠాధిపతుల, మఠాధిపతుల, ఆలయాధికారుల, అర్చక ప్రముఖుల, వేదపండితులతో పాటు వేలాది భక్త బృందాల ప్రశంసలు వర్షిస్తున్నాయి.

నాలుగు వందల పేజీలతో పవిత్రతల వైభవోపేతంగా ఆకట్టుకుంటున్న శ్రీమాలిక అఖండ దివ్య గ్రంధం (Srimalika Akhanda Divya Granthm) పై ఇప్పటికే వేంకటాద్రి, యాదాద్రి, ఇంద్రకీలాద్రి వంటి మహాక్షేత్రాల ప్రధాన అర్చకుల ప్రశంసలతో పాటు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, మరొక పద్మభూషణ్ శాంత బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి వంటి ప్రముఖుల సమర్పణలో వారి స్వహస్తాల కొన్ని శ్రీమాలిక ప్రతులు వితరణకు నోచుకోవడం విశేషం.

అంతేకాదు … వేదవిహిత ధర్మాలకు పట్టుకొమ్మైన శృంగేరి మహాక్షేత్ర శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి, శృంగేరి పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామి వారి అనుగ్రహ బలంగా అనంత హలితాలనిచ్చే ఈ పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక గ్రంధాన్ని హైదరాబాద్ శ్రీ జ్ఞానసరస్వతీ దేవాలయం (Jnanasaraswati Temple) ఉభయ తెలుగు రాష్ట్రాల శంకర మఠాలకు ఉచితంగా వందల కొలది గ్రంధాలను సమర్పించనున్నట్టు ధర్మాధికారి కళా జనార్ధనమూర్తి తెలిపారు.

ఆర్షభారతికి అనేక అపురూప గ్రంధాల ద్వారా అద్భుత అమోఘ హారతినిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ విరామమెరుగక పరిశ్రమిస్తున్న తీరు ఆశ్చర్య పరుస్తోందని, గతంలో వరల్డ్ తెలుగు ఫెడేషన్ అధ్యక్షురాలు ఇందిరాదత్ (Indira Dutt), సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి (Ramanachary), బొల్లినేని గ్రూప్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah), వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి (Sai Korrapati), వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ (Chalasani Ashwini Dutt) వంటి ప్రముఖుల ప్రోత్సాహంతో తమ ఆలయం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ శివార్పితంగా భక్తులకు అందించినప్పుడు వచ్చిన స్పందన ఊహాతీతమని పేర్కొన్నారు. త్యాగరాయ గానసభకు శ్రీమాలిక ప్రతులు చేరాయని, జ్యేష్ఠ పూర్ణిమ అందర్భాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం జంటనగరాలలో సాంస్కృతిక సంస్థల ప్రతినిధులకు శ్రీమాలికను బహూకరిస్తున్నట్లు కళా జనార్ధనమూర్తి చెప్పారు. బహుశా భారతదేశంలోనే ఆధ్యాత్మిక భావజాల పరీవ్యాప్తికి ఇలా మంత్ర పేటికల మహామహోద్యమాన్ని నిస్వార్ధంగా చేస్తున్న వ్యక్తి పురాణపండ శ్రీనివాస్ మాత్రమే తెలుగులో మనకు స్ఫుటంగా, స్వచ్ఛంగా మన కన్నుల ఎదుట కనిపిస్తున్నారని తనతో కే.వి. రమణాచారి, కొలకలూరి ఇనాక్ వంటి పెద్దలన్న మాటను ఈ సందర్భంలో జనార్ధనమూర్తి గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *