Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్ర‌హం

Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్ర‌హం

క‌డియం శ్రీ‌హ‌రిని బెదిరించాడ‌ని ఆరోప‌ణ‌
వీడియో ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాలి
బర్తరఫ్ చేయాలని డిమాండ్

Kaushik Reddy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైఖరిపై శాసనసభలో దుమారం రేగింది. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు స‌రికాద‌ని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి తీరును వారు తప్పుబట్టారు. కడియం శ్రీహరికి కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్‍తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగల్ చేశారనే ఆరోపణలు రావడంతో కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్‍ను కోరారు. కౌశిక్‍రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.