Ap-Cultural-Hub : ఆ 3 సిటీలకు గుడ్ న్యూస్ Andhra Prabha Top News
Ap-Cultural-Hub : ఆ 3 సిటీలకు గుడ్ న్యూస్ Andhra Prabha Top News
- ఇక అవి కల్చరల్ హబ్
- కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
- కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ
- విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్రం
- ఈ మేడు ప్రాంతీయ కార్యాలయాలకు పచ్చజెండా
- నెల రోజుల్లో ఈప్రతిపాదనలకు కార్యరూపం
- మంత్రి దుర్గేష్ వెల్లడి
- ఢిల్లీలో ఏపీ టూరిజం స్టాల్ కు ఆదరణ
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ ప్రతినిధి )
Ap-Cultural-Hub : ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలఖ/ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చుతాయని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. త్వరలోనే ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం నుండి అధికారిక సర్క్యులర్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ కాగ, ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల దోరణితో స్పందించింది. రాజమహేంద్రవరం, విజయవాడ, కడపల నగరాలకు ఇది గుడ్ న్యూస్. సాంస్కృతిక హబ్‌లుగా ఈ నగరాలు మారుతాయి. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో నిరంతర ఫాలోఅప్‌తో ప్రతిపాదనలు మంత్రి కందుల దుర్గేష్ సాధించారు.

రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటునకు కేంద్రం అంగీకరించింది. కడపలో త్వరలోనే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్నాటు చేస్తుంది. విజయవాడ జీవీఆర్ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో అత్యాధునిక ‘కళాక్షేత్ర ఆడిటోరియం’ నిర్మాణానికి అంగీకరించింది. రాష్ట్రంలో లలిత కళా అకాడమీ, ఐసీసీఆర్ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటునకు కేంద్రం సుముఖత:వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలకు పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెడితే పూర్తి భరోసా కల్పిస్తామని ఇన్వెస్టర్లకు మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ “ఫెయిత్ టూరిజం కాన్క్లేవ్-2026” లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ టూరిజం స్టాల్ నిలిచింది. ఏపీ టూరిజం స్టాల్‌ను సందర్శించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో, ఇన్వెస్టర్లతో స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు.
