వినియోగదారులకు మరింత చేరువగా సేవలు…

మామడ, ఆంధ్రప్రభ: స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంలో కరీంనగర్ డైరీ ఎల్లప్పుడూ ముందుంటుందని కరీంనగర్ డైరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు అన్నారు.

సోమవారం మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో కరీంనగర్ డైరీ పార్లర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాణ్యమైన పాల ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ చేయడమే డైరీ లక్ష్యమని తెలిపారు.

పాల ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా డైరీ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావుతో పాటు జగిత్యాల మేనేజర్ లక్ష్మీపతి, సెల్స్ ఏజీఎం విష్ణు, సూపర్‌వైజర్లు రమేష్, చందు, పార్లర్ నిర్వాహకుడు సిలివేరి రాజన్న, నాయకులు చిట్యాల రాజారెడ్డి, కొండ్ర రాజారెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply