బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
-మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ నేత మేరుగు ప్రసాద్ తండ్రీ మేరుగు మల్లేష్ పై ఆదివారం కన్నెపల్లి మండలం జజ్జర్ వెళ్లి గ్రామంలో కాంగ్రెస్ నేత లింగంపల్లి శంకర్, మరికొందరు కలిసి కత్తుల తో దాడికి పాల్పడడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేరుగు మల్లేష్ ను దుర్గం చిన్నయ్య సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో మేరుగు ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడంపై కక్ష గట్టిన కాంగ్రెస్ నేత లు మేరుగు మల్లేష్ పై కత్తులతో దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నేత నర్సింగరావుల ప్రోత్బలం తోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై గ్రామం లో దాడు లు జరుగుతున్నాయని దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
స్థానిక రాజకీయాల్లో పెరుగుతున్న హింసపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేరుగు మల్లేష్ ను కాంగ్రెస్ నాయకులు దాడి దాడి చేయడం తో తీవ్రంగా గాయపడగా అతన్ని ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ ను అడ్డుకొని చంపేస్తామని దాడికి పాల్పడ్డ వారు బెదిరించడం అమానుషమన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో హింస సంస్కృతిని కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారు.
పదేళ్లు రాష్ట్రం అధికారంలో ఉన్నపుడు ఇలాంటి హింసాత్మక చర్యలకు తాము పాల్పడలేదనిచిన్నయ్య చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల సహనాన్ని కాంగ్రెస్ నాయకులు పరీక్షిస్తే ఇకపై పదిరెట్లు ఇలాంటి ఘటన లను తిప్పికొడతామని చిన్నయ్య హెచ్చరించారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పురాతకం కాకుండా పోలీస్ ఉన్న తాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నయ్య డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.
