పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం…
నిర్మల్, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల 40 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు, వైద్య చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోందని చెప్పారు. ప్రజలు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, తమ సమస్యలను గుర్తించి సహాయం అందించిన కూచాడి శ్రీహరిరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
