కండ్లకుంటలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
కండ్లకుంటలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
నకరికల్లు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సిన్హా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమినేని వందనాదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి, ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

గ్రామంలో శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు కీలకమని పేర్కొన్నారు.

తదుపరి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యఘర్ పథకం ద్వారా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్, స్థానిక నాయకులు సౌరయ్య, బాజీ చౌదరి, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
