కుటుంబ సర్వే వేగవంతం చేయాలి – ఆర్డీవో బాలకృష్ణ

కుటుంబ సర్వే వేగవంతం చేయాలి – ఆర్డీవో బాలకృష్ణ

శావల్యాపురం, ఆంధ్రప్రభ : కుటుంబ సర్వేని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవో బాలకృష్ణ అన్నారు. సర్వేలో ఎటువంటి పొరబాట్లకు తావు లేకుండా సిబ్బంది అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా శావల్యాపురంలో జరుగుతున్న కుటుంబాల సర్వేని ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడి సర్వే పురోగతి, లోటుపాట్లు తెలుసుకొన్నారు.

ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ శావల్యాపురంలో మండలంలో కుటుంబ సర్వే 18 శాతం మాత్రమే పూర్తయిందని, సిబ్బంది సర్వేని వేగవంతం చేసి నెలాఖరుకు నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 50కుటుంబాలు సర్వే చేయాలని, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. తహసీల్దార్ అర్జున్నాయక్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు, రెవెన్యూ ఇన్సిపెక్టర్ చంద్రబాబు, వీఆర్వో రమాదేవి పాల్గొన్నారు.

Leave a Reply