చలివేంద్రం వెనుక సేవా స్పూర్తి
పాయకాపురం, ఆంధ్రప్రభ: మండుటెండల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
స్థానిక 64వ డివిజన్ కండ్రికలో టీడీపీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో ప్రయాణికులు, బాటసారుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎండాకాలం తీవ్రంగా కొనసాగుతోందని, ముఖ్యంగా విజయవాడ నగరంలో మండుటెండలు, వడగాలులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.
గత 22 రోజులుగా నిరంతరంగా చలివేంద్రం నిర్వహిస్తూ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, ఆయన బృందం చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకోల్లు హర్షసాయి, ప్రధాన కార్యదర్శి ఎస్.కే. బాబు, యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్, అడప సాయి, కంకణాల బాబు, తెల్ల భవాని, పొట్నూరి అప్పలనాయుడు, బలుగూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
