సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ చెప్పారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మురికి కాలువలు శుభ్రంగా ఉందే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమిష్టిగా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా గ్రామసభలు నిర్వహించి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. సంస్థల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సర్పంచి బల్యల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, సచివాలయ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, పాలకవర్గ సభ్యులు వివిధ శాఖల అధికారులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
