Kalvakuntla Kavitha | కోర్టుకు కవిత హాజరు
రైల్ రోకో కేసులో విచారణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో కామారెడ్డిలో రైల్ రోకో
సికింద్రాబాద్ రైల్వే కోర్టులో రెండోసారి విచారణకు హాజరైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నేతలు
Kalvakuntla Kavitha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. సికింద్రాబాద్ బోయిగూడలోని 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఫర్ రైల్వేస్‌లో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా కవిత, ఇతర టీఆర్ఎస్ నాయకులు రెండోసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రైల్ రోకో సందర్భంగా నమోదైన కేసులో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
