CDS Appointment | లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు

CDS Appointment | లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత సేనకు (Indian Armed Forces) కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff, CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన తర్వాత జరిగింది. తదుపరి అధికారిక ఆదేశాల వరకు జనరల్ రాజా సుబ్రమణి సీడీఎస్ పదవిలో కొనసాగుతారు.

జనరల్ సుబ్రమణి భారత సేనలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని ఉన్న‌ వ్యక్తి. ఆయన అనేక వ్యూహాత్మక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవం, వ్యూహాత్మక పరిజ్ఞానం వల్ల ఆయన CDS బాధ్యతలను సఫలీకృతంగా నిర్వహిస్తారు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీడీఎస్ పదవీ బాధ్యతలు భారత సైన్యం, నావికా, వాయుసేనలకు సమన్వయం మరియు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం, రక్షణ వ్యూహాలను రూపకల్పన చేయడం, ప్రధాన మిలిటరీ ఆపరేషన్ల పర్యవేక్షణ చేయడం త‌దిత‌ర‌ కీలక అంశాలు ఉంటాయి. జనరల్ రాజా సుబ్రమణి నియామకం రక్షణ రంగంలో ప్రస్తుత మరియు భవిష్యత్ వ్యూహాత్మక కార్యాచరణలకు కొత్త దిశనిర్దేశం ఇస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply