ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలి -బి ఆర్ ఎస్
కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
చిట్యాల, జులై 17 ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని హైవేపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం చిట్యాల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 జూలైలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రకటించినప్పటికీ, రెండున్నరేళ్లు గడిచినా పనులు పూర్తికాలేదని ఆరోపించారు . పనులు ఆలస్యం కావడంతో చిట్యాల పట్టణంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి పట్టణ ప్రజల ఇబ్బందులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల సింగల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి మరియు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి , బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్టా బొందయ్య , స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీను వాసు,2వ వార్డ్ కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్ ,కందాటి రమేష్ రెడ్డి ,ఆగు అశోక్ యాదవ్ కన్నెబోయిన శ్రీశైలం ,రుద్రవరం యాదయ్య, మారగోని రమేష్ ,నాళావతి కృష్ణ, ఆవుల ఆనంద్ ,జిట్ట శేఖర్,సాయి రెడ్డి ప్రతాపరెడ్డి ,పోకల రాములు, కునూర్ శంకర్ ,పాల కిష్టయ్య, రామగిరి జనార్దన్ రావు ,రుద్రారపు కృష్ణ, బాలు ,మాసపెల్లి వెంకన్న ,తోటకూరి అనిల్ రాగుల శివ ,Md ముజ్జు ,పో లాస్ కన్యాచారి ,చింతపల్లి ప్రవీణ్, ఐలాపూర్ నరేష్ ,బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్ ,సిలువేరు రిశ్వంత్ ,గూడ అఖిల్ ,బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
