వినతి పత్రం అందజేస్తున్న ఏకు శంకర్..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ
పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పరకాల ఎంఈఓ సురేందర్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఏకు శంకర్ మాట్లాడుతూ పరకాల మండల పరిధిలో ఉండబడే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం పాఠశాలలంటే పేద, మధ్యతరగతి పిల్లలు చదువుకుంటారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉదయం అందించే టిఫిన్ మరియు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారంగా త్రాగునీరు కూడా నాణ్యత ఉండేలా చూడాలని, వంటలు వండుతున్న పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత పాఠ్యపుస్తకాలను మరియు యూనిఫాములను ప్రతి ఒక్క విద్యార్థికి అందేలా చూడాలని, అలాగే వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నూతన విద్యా విధానంలో వివిధ రకాల మెలకువలు నేర్పుతూ ఆటలు మరియు పాటల పోటీలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ నూతన ఉత్తేజాన్ని నింపుతూ విద్యార్థిని విద్యార్థులకు మనోధర్యాన్ని నింపాలని, అందుకు విద్యాశాఖ అధికారిగా తమరు తమ తమ కర్తవ్యాన్ని మానవతా కోణంలో చొరవ తీసుకొని మంచి భోజనం త్రాగునీరు మానసిక ఉల్లాసంతో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషిచేసి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల చదువుతున్న నీరు పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యార్థినీ, విద్యార్థులకు తోడ్పాటు అందించి వారి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని శంకర్ వినతిపత్రంలో కోరారు.
