ముఖ్యమంత్రిని కలిసిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజ్
వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం సాయంత్రం బి.ఎన్.రెడ్డి నగర్‌లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కాకి రంగరాజ్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తనను గుర్తించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఆయనకు అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారనే విశ్వాసాన్ని కాకి రంగరాజ్ వ్యక్తం చేశారు.
