నిన్నటి త్యాగాలను స్మరిస్తు..రేపటి లక్ష్యాన్ని చేరుకుందాం

నిన్నటి త్యాగాలను స్మరిస్తు..రేపటి లక్ష్యాన్ని చేరుకుందాం

  • ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే

జుక్కల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జుక్కల్ ప్రజలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. గత త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

స్వరాష్ట్రంలో ప్రజలు గర్వంగా జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి జరుగుతోందని వివరించారు.

జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply