రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం

రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం

  • ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి సందర్భంగా అచ్చంపేట పట్టణంలో ఆయన విగ్రహానికి నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆధునిక భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ముఖ్యంగా యువతకు సాంకేతిక విప్లవం అందించడంలో, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చూపిన దూరదృష్టి నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మాజీ ఎంపీపీ రామనాథం, ప్రజాప్రతినిధులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.

Leave a Reply