రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించి అధిక లాభాలు పొందాలని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లిఅంజయ్యఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ రైతు వేదిక భవనంలో మిషన్ ఆత్మ నిర్భరత పథకం కింద రైతులకు విత్తనాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలనిసూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలనికోరారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు అవసరమైన మద్దతు అందించడం వల్ల పంటల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందన్నారు. కంది విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అరవింద్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.