AP | బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ క‌ల‌క‌లం..

అస్వస్థతకు గురైన విద్యార్థులు జీజీహెచ్‌కు తరలింపు..
చికిత్స అందిస్తున్న వైద్యులు


గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరులోని బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఆహారం తీసుకున్న అనంతరం ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రిలో బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

అయితే విద్యార్థులు ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఫుడ్ పాయిజన్‌కు కారణమైన ఆహారం ఏమిటి? అనే అంశాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

విద్యార్థులకు నిన్న ఐరన్ టాబ్లెట్ లు ఇస్తే అవి కొంత మందికి వాసన పడక, వికారం వచ్చి వాంతులు కావడంతో GGH లో అడ్మిట్ ఐయ్యి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఎలాంటి ప్రాణప్రాయం లేదని సమాచారం.